విజయానికి దగ్గరి దారి ఏదీ లేదు. అలవిమాలిన శ్రమ, కఠోర దీక్షతోనే విజయం సాధ్యమవుతుంది. 'సక్సెస్ మ్యాగజైన్' ప్రచురణకర్త డారెన్ హార్డీ రచించిన 'ది కాంపౌండ్ ఎఫెక్ట్' పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. జీవితంలో ఎంత మాత్రమూ ప్రాధాన్యం లేదని భావించే మీరు విషయాలే మీ భవిష్యత్తును, జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీరు దైనందిన జీవితంలో తీసుకునే చిన్నచిన్న నిర్ణయాలు మీ జీవితమనే నావను ఒడ్డుకు చేరుస్తాయి లేదా విపత్తుకు గురిచేస్తాయి. ఈ చిన్నచిన్న నిర్ణయాల ఫలితమే భవిష్యత్తులో 'సమ్మిశ్రణ ప్రభావం'గా ప్రతిఫలిస్తుంది. ఈ సత్యమే 'సమ్మిశ్రణ ప్రభావం' మీకు అందించే కానుక.